10-02-2025 10:06:19 PM
క్రీడాలను నిర్వహించిన సిఆర్పిఎఫ్ జవాన్లు..
చర్ల (విజయక్రాంతి): క్రీడలు శారీరక దారుణ్యానికి దోహదపడతాయని, స్నేహభావాన్ని పెంపొందించాలని సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ అన్నారు. సోమవారం సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో జవాన్లకు, గ్రామస్తులకు మధ్య వాలీబాల్ పోటీలను నిర్వహించారు. సిఆర్‌పిఎఫ్ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద క్రీడాలను నిర్వహించారు. తిప్పాపురం క్యాంప్‌లో సిఆర్‌పిఎఫ్, టిక్లర్ గ్రామ జట్టు మధ్య సిఆర్‌పిఎఫ్ సి/218 బెటాలియన్ వాలీబాల్, బ్యాడ్మింటన్ స్నేహపూర్వక పోటీలు జరిగాయి.
ఈ సందర్భంగా సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ మాట్లాడుతూ... గ్రామస్తులు, పోలీసు బలగాల మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడటానికి, నక్సల్ ప్రభావిత ప్రాంతం నుండి మంచి ఆటగాళ్లను తయారు చేయడానికి సిఆర్‌పిఎఫ్ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ కార్యక్రమాలను నిర్వహిస్తూనామన్నారు. ఈ సందర్భంగా CRPF గౌరవ సూచకంగా క్రీడాకారులకు టవల్స్, వాలీబాల్, వాలీబాల్ నెట్, ఇతర క్రీడా సామగ్రిని పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో CRPF ఇన్‌స్పెక్టర్ లోకేంద్ర సింగ్, నితేష్ కుమార్, పమేడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మింజ్, ఇతర జవాన్లు పాల్గొన్నారు.