calender_icon.png 26 October, 2024 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయి

28-08-2024 04:07:37 PM

శ్రీరాంపూర్ ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్

మంచిర్యాల, (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని శ్రీరాంపూర్ ఇన్చార్జి జనరల్ మేనేజర్ టి శ్రీనివాస్ అన్నారు. గురువారం శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించిన డబ్ల్యూపీఎస్, జిఏ వార్షిక క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని వార్షిక క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకాలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు అనేవి శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సింగరేణి యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ఏరియాల ఉద్యోగ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉద్యోగులు తమ తమ పనులను నిర్వహిస్తూనే క్రీడలలో ఆసక్తి చూపడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. వాలీబాల్ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులు చాలామంది యువకులు ఉన్నారని, క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు ఏరియా లెవల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, కంపెనీ లెవెల్ లో, కోల్ ఇండియా లెవెల్ లో కూడా అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలని కోరారు. అనంతరం వాలీబాల్ క్రీడాకారులతో కలిసి ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం ఎన్ సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, డీజీఎం పర్సనల్ పి అరవింద రావు, స్పోర్ట్స్ హానరరీ సెక్రటరీ పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నర్సయ్య, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్, వాలీబాల్ కెప్టెన్ చిన్నన్న తదితరులు పాల్గొన్నారు. గురువారం జరిగిన వాలీబాల్ పోటీలలో విజేతలుగా ఆర్కే 7 గ్రూప్ జట్టు నిలువగా రెండవ స్థానంలో శ్రీరాంపూర్ గ్రూప్ జట్టు నిలిచింది.