సంఘం ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌ఎమ్ హుస్సేని
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌ఎమ్ హుస్సేని(ముజీబ్) అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఎస్‌ఎమ్ హుస్సేని మాట్లాడుతూ.. వివిధ యూనిట్స్ అధ్యక్షులు, కార్యదర్శులతో డిసెంబర్ 10న గగన్‌మహల్ మైదానంలో 11వ స్పోర్ట్స్, గేమ్స్ ఉంటాయని అన్నారు.
పురుషులకు.. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నీస్, షార్ట్‌ఫుట్, మహిళలకు.. క్యారమ్స్, చెస్, రంగోలి, సింగింగ్, టగ్‌ఆఫ్‌వార్, లెమన్ స్పూన్ వంటి క్రీడాపోటీలు నిర్వహిస్తారన్నారు. జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు కేఆర్.రాజ్‌కుమార్, కోశాధికారి బాలరాజ్, సభ్యులు ఉమర్‌ఖాన్, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.