04-03-2025 06:18:04 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ౦ సందర్భముగా సేవా అధ్యక్షురాలు వి.రమ ఆదేశాలతో ఉద్యోగులకుటుంబాల మహిళలకు, సేవా సమితి సభ్యులకు ఆటల పోటీలను స్థానిక సింగరేణి పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ఈ పోటిలలో గెలుపొందిన విజేతలకు మర్చి 8 న సి.ఇ.ఆర్ క్లబ్ లో నిర్వహించబడే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో సేవా అధ్యక్షురాలు వి.రమ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరుగుతుందని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్, సేవా కార్యదర్శి సులక్షణ, మహిళలు, సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.