calender_icon.png 19 November, 2024 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న దివ్యాంగులకు క్రీడాపోటీలు

19-11-2024 01:51:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18(విజయక్రాంతి): అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో దివ్యాంగులకు క్రీడాపోటీలునిర్వహిస్తున్నట్లు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జండర్స్ సాధికారిత శాఖ సహాయ సంచాలకులు ఏ రాజేందర్ తెలిపారు. జూనియర్ విభాగంలో 10 ఏళ్ల వారికి, సీనియర్స్ విభాగంలో 18 ఏళ్లలోపు వయసున్న వారికి వివిధ విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 96404 52773 నంబర్‌లో సంప్రదించాలని ఆయన  సూచించారు.