కరీంనగర్, నవంబరు 19 (విజయక్రాంతి): డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ సునీల్‌రావు పోటీలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఈవో జనార్ధన్‌రావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాశ్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.