calender_icon.png 31 October, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఉల్లాసానికి క్రీడ పోటీలు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్

30-08-2024 12:16:48 PM

ఖమ్మం, (విజయక్రాంతి): క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం పరేడ్ మైదానంలో ట్రైనీ కానిస్టేబుళ్ల రెండు రోజుల గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ క్రీడా పోటీలకు ముఖ్యతిధిగా శుక్రవారం హజరైన పోలీస్ కమిషనర్ ముందుగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆనంతరం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. గాలిబుడగలను ఎగురవేశారు. వాలీబాల్, క్రికెట్ పోటీలలో క్రీడాకారులతో కలసి పోలీస్ కమిషనర్ పాల్గొని అడారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... డెబ్భై శాతం శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న 263 మంది సివిల్ & ఏఆర్ ట్రైనీ కానిస్టేబుళ్లను అభినందించారు. పోలీస్ శిక్షణలో భాగంగా నిత్యం ఇండోర్, ఆవుట్ డోర్ శిక్షణలో నిమగ్నమై వున్న సిబ్బందికి మానసిక ప్రశాంతత కోసం ప్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఆటల పోటీలు నూతన ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడాకారులు టిమ్ స్పూర్తితో ముందుకు సాగుతూ ప్రతిభ కనబర్చాలని అన్నారు. గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించి ముందుకు సాగా ల న్నా రు. కార్యక్రమంలో సిటిసీ ప్రిన్సిపల్/ అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ACP రవి, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ఐ అప్పాలనాయుడు, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.