calender_icon.png 22 January, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా దివ్యాంగుల క్రీడా పోటీలు

03-12-2024 12:00:14 AM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని సింగరేణి హై స్కూల్ మైదానంలో దివ్యాంగుల క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం మనోవికాస్ పాఠశాల విద్యార్థులకు క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను సింగరేణి డివైపిఎం ఎండి ఆసిఫ్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, మనోవికాస్ స్పెషల్ స్కూల్ ఇంచార్జ్ టి.సురేఖ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోవికాస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 3న బహుమతులు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోవికాస్ పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.