calender_icon.png 10 April, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చు

27-03-2025 12:36:11 AM

ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్ మార్చి-25: జిల్లా కేంద్రంలో క్రికెట్,సెటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్.బుధవారం రోజు జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ  వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం క్రీడ మైదానంలో మెడికల్ విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని టాస్ వేసి క్రికెట్ క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... ముందుగా  క్రీడల్లో ఉత్సహంగా పాల్గోన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వహకులను ఎస్పీ అభినందించారు. క్రీడలు ఆడే స్ఫూర్తి చాలా గొప్పదని ప్రతి ఒక్కరు క్రీడలను ఆడుతూ మనసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని  కోరారు.

ఇలాంటి  క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, మీరు ఈ క్రీడల ద్వారా మీ శారీరక దేహ దారుడ్యం మెరుగుపడుతుండటంతో పాటు, పనిఒత్తిళ్ళను అధిగమించి ఆరోగ్యంగా వుంటారని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్, కిరణ్మయి, వైద్య కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.