calender_icon.png 13 January, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని కలిగిస్తాయి

13-01-2025 01:51:42 PM

ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు

సిద్దిపేట,(విజయక్రాంతి): క్రీడలు శారీరక, మానసిక, వికాసాన్ని కల్గిస్తాయని ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు(Poet Kandukuri Sriramulu) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రావురుకులలో బండి చిన్న నర్సయ్య జ్ఞాపకార్థం సేవ భావ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం సహకారంతో నిర్వహించిన మండల స్థాయి క్రీడాపోటీల గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. యువకుల చేతుల్లో భవిష్యత్ ఉందని, సన్మార్గంలో నడిచి గ్రామానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.

చొప్పదండి ఎంపీడీఓ దమ్మని రాము(Choppadandi MPDO Damani Ram) మాట్లాడుతూ... తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ రోజుల్లో తన తండ్రి జ్ఞాపకార్థంగా మండల స్థాయి క్రీడలను నిర్వహిస్తున్న శ్రీకాంత్ ను అభినందించారు. ఉన్నత చదువులు చదివి, డాక్టరేట్ పొంది తాను పుట్టిన గ్రామంలో సేవ కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. గ్రామీణ యువకులు చదువుతో పాటు క్రీడల్లో  రాణించి తల్లిదండ్రుల కళలను నిజం చేయాలని చెప్పారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 3వెలు, రెండవ బహుమతి రూ.2వెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షులు శేరుపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ కవిత రవీందర్, మాజీ ఉపసర్పంచ్ మారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ యువకులు కొమ్ము రవీందర్, రంజిత్ కుమార్, బి. స్వామి, కె.రమేష్ వెంకట్, సురేష్, హరికిషన్, మధు, పర్షరములు, సాయిరెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.