11-03-2025 07:41:02 PM
కాటారం,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) పురస్కరించుకొని జిల్లా మహిళా సంక్షేమ శాఖ(District Women Welfare Department) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. క్రీడలు అనేవి మానసికంగా ఉత్సాహం కలిగిస్తాయని, అదేవిధంగా శారీరకంగా కూడా ఉపయోగపడతాయని, క్రీడలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి మాట్లాడుతూ ఓటమి చెందితే బాధపడొద్దని, గెలుపు వస్తే ఉప్పొంగి పోవద్దని, ప్రతి దానిలో గెలుపోటములు సహజమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవ పూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.