దస్తురాబాద్ (విజయక్రాంతి): క్రీడల వల్లనే మానసిక వికాసం పెరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం కడెం మండలంలోని అల్లంపూర్ చిన్న జీయర్ స్వామి గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న క్రీడ పోటీలను చిన్న జీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు. మార్ముల గిరిజన ప్రాంతాల్లో చిన్న జీయర్ స్వామి పాఠశాలను ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందన్నారు. తమ ప్రభుత్వం విద్యతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.