17-12-2024 12:13:13 AM
నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమేనని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాజట్లు జిల్లాస్థాయిలో పోటీపడనున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడ లు కూడా ముఖ్యమేనన్నారు. ఈ పోటీలో పాల్గొనే జట్లు గెలుపోటములను ఒకే తీరుగా చూ డాలన్నా రు. ఓడిన జట్టు నిరాశ చెం దకుండా గెలుపుకోసం పోరాడాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబ రిచి రాష్ట్రస్థాయికి వెళ్లి గెలవాలని చెప్పారు. క్రీడాకారులకు ఇబ్బందు లు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖమార్ అహ్మద్ పాల్గొన్నారు.