సినియర్ సివిల్ జడ్జీ రాధిక
నిర్మల్ (విజయక్రాంతి): చదువుకునే విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడ ముఖ్యమే అని నిర్మల్ జిల్లా జడ్జీ రాధిక అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని ఎన్‌టాఆర్ స్టేడియంలో బీసిసంక్షేమా హస్టల్ విదార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను మరో జడ్జీ శ్రీనివాస్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌లో కలిసి ప్రాంరంభం చేశారు. జిల్లాలోని 22 హస్టల్‌లలో ఉండి చదువుకొంటున్న విద్యార్థి విద్చార్థులకు వాలిబాల్, కబడ్డి, ఖోఖో, రన్నింగ్, అథ్లటిక్ తదితర పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జీ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగ చదవడంతో పాటు ఉత్సాహం ఉన్న రంగాల్లో రాణించేలా అధికారులు పోత్సాహాం అందించాలని సూచించారు. ఆటల్లో గెలుపు ఓటములు సహాజమని ప్రతి ఒక్కరు గెలుపుకోసం ఆడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి శ్రీనివాస్, సహాయ అధికారి సత్యనారాయణ రెడ్డి, అధికారులు ఖాలీద్, సృజన్ రాజు, భాగ్యలక్ష్మీ, రమేష్, రవి తదితరులు పాల్గోన్నారు.