calender_icon.png 24 November, 2024 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సంస్థలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

24-11-2024 04:46:19 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు ఏరియా సింగరేణి సంస్థలో క్రీడలకు, క్రీడాకారులకు యాజమాన్యం అధిక ప్రాధాన్యమిస్తుందని  ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ అన్నారు. 2024-25 వార్షిక సంవత్సరంలో నిర్వహించినటువంటి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ వార్షికోత్సవం ఘనంగా 24 ఏరియా లోని వై.సి.ఓ.ఎ క్లబ్ నందు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జి.యం. మాట్లాడుతూ.. 24 ఏరియాలోని రన్స్, గోల్స్ స్టేడియం నందు క్రీడాకారులకు అన్ని ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుడ్యo పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి తనకు వెసులుబాటు ఉన్న సమయంలో కచ్చితంగా రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అన్నారు.

అదేవిధంగా సంక్షేమంలో భాగంగా స్థానిక 24 ఏరియా, జెకె కాలనీ గ్రౌండ్ నందు వాకింగ్ ట్రాక్ లను, సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్ లు, పార్క్ లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఇటు ఉత్పత్తిలోనే ఉద్యోగుల సంక్షేమంలో కూడా సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని, కార్మికుల సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థ మహిళా ఉద్యోగులకు కూడా క్రీడలలో అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు విధులలోనే కాకుండా క్రీడలలో ప్రతిభ చాటారని వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. తదుపరి వివిధ క్రీడల్లో గెలుపొందిన ఉద్యోగులకు అభినందనలు తెలిపి, బహుమతులు ప్రధానం చేశారు. తదుపరి ఇల్లందు ఏరియా క్రీడాకారులు ఏరియా జియంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జియం బొల్లం వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షులు శివ ప్రసాద్, డిజియం (పర్సనల్) జీవి మోహన్ రావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కే.సాయి స్వరూప్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.