18-03-2025 01:36:12 AM
కోదాడ మార్చి 17: కోదాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా సాహిత్య సంస్కృతిక పోటీలు ఆత్మీయతకు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు.
సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియం మైదానంలో రసవత్వంగా నడుస్తున్న క్రీడా సాంస్కృతిక పోటీలను, పర్యవేక్షించి మాట్లాడారు భారతదేశ చరిత్రలోనే కోదాడ లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక సాహిత్య పోటీలు నిర్వహించడం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది అన్నారు.
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి బొల్లు రాంబాబు, యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, అక్కిరాజు వెంకట్రావు, విద్యాసాగర్ రావు, భ్రమరాంబ, రఘు, ఓరుగంటి రవి తదితరులున్నారు.