calender_icon.png 22 April, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లూరు స్ఫూర్తి ఫౌండేషన్ ఆఫీస్ ను సందర్శించిన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్

21-04-2025 08:58:44 PM

కల్లూరు,(విజయక్రాంతి): స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఉయ్యురి శ్రీ వ్యాల్, వారి సతీమణి ఉయ్యురి వెంకటేశ్వరి, కిరణ్ కుమారి (జిఎస్ టి సూపరింటెండెంట్ హైదరాబాద్) ఆదివారం కల్లూరు స్ఫూర్తి ఫౌండేషన్ ఆఫీస్ ను సందర్శించారు. ఈ సందర్బంగా కల్లూరు చుట్టుపక్కల పేద, ఉన్నత చదువులు చదువుతున్న ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని కొనియాడారు. సేవా గుణాన్ని మెచ్చుకొని కిరణ్ కుమారి స్ఫూర్తి ఫౌండేషన్ లో బాగంగా జల్ది సాత్విక కు క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహ బహుమతిని శ్రీ వ్యాల్  దంపతులు, ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు ఆధ్వర్యంలో విద్యార్థికి అందించటం జరిగింది. బహుమతిని అందించిన ధాత కిరణ్ కుమారికి, శ్రీవ్యాల్ కి, రామారావుకి సాత్విక తల్లీదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ కాలంలో దాదాపు 40 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించటం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్ కి వాలంటీర్లు సన్మాన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు, వాలంటీర్లు ఉబ్బన బాబురావు, రామకృష్ణ , లబ్ధిదారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.