calender_icon.png 25 February, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌పీఎం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి

19-02-2025 12:00:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం పేపర్ మిల్లు గుర్తింపు కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు న్యాయం జరగాలి అంటే కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు అనివార్యమని ఇప్పటికే ఎమ్మెల్యే హరీష్ బాబుకు తెలిపామన్నారు. ఈ సమావేశంలో ఐఎన్టియుసి, బిఎంఎస్, ట్రేడ్ యూనియన్ సంఘం నాయకులు మురళి, వెంకటేష్, రాజన్న, రమణయ్య, ఓదెలు, కన్నయ్య, వెంకటేశం ,రాములు, శ్రీనివాస్, షబ్బీర్ హుస్సేన్, శ్యామ్ రావు, రాజేష్ ,శ్రీనివాస్ ,అశోక్, సారంగపాణి నాయకులు పాల్గొన్నారు.