18-02-2025 05:55:19 PM
సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం పేపర్ మిల్లు గుర్తింపు కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులకు న్యాయం జరగాలి అంటే కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు అనివార్యమని ఇప్పటికే ఎమ్మెల్యే హరీష్ బాబుకు తెలపడం జరిగిందన్నారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడంతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లేబర్ కమిషన్ ను కలిసి గుర్తింపు సంఘం ఎన్నికలకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారని పేర్కొన్నారు. అన్ని గుర్తింపు సంఘాలు కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎన్టి యుసి, బిఎంఎస్, ట్రేడ్ యూనియన్ సంఘం నాయకులు మురళి, వెంకటేష్, రాజన్న, రమణయ్య, ఓదెలు, కన్నయ్య, వెంకటేశం, రాములు, శ్రీనివాస్, షబ్బీర్ హుస్సేన్, శ్యామ్ రావు, రాజేష్, శ్రీనివాస్, అశోక్, సారంగపాణి నాయకులు పాల్గొన్నారు.