13-02-2025 01:15:22 AM
ముంబై, ఫిబ్రవరి 12: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) విచ్చిన్న మయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను మెచ్చుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మంగళవారం ముంబైలో నిర్వహించి న ఇండియా మరాఠీ లిటరసీ కాన్ఫరెన్స్‌లో శరద్‌పవార్ డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ‘మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కార్’తో సత్కరించారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే చాలా బాగా పనిచేశారని శరద్ పవార్ మెచ్చుకున్నారు. అయితే పవార్ చేసిన పని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు రుచించలేదని సమాచారం. పవార్ చర్యను శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ కూ డా తప్పుబట్టారు.
ఎన్సీపీ అధినేత పవార్.. ఏక్‌నాథ్‌షిండేను సన్మానించడం ద్వారా హోం మంత్రి అమిత్ షాను గౌరవించినట్లయిందని చురకలంటించారు. అమిత్ షా సహాయంతోనే షిండే శివసేనను రెండు ముక్కలు చేసిన విషయాన్ని పవార్ మరిచిపోయినట్లు గుర్తుచేశారు. అయితే ఎన్సీపీ (ఎస్‌పీ) మాత్రం సంజయ్ వ్యాఖ్యలను ఖండించింది.