calender_icon.png 23 December, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతోనే మానసిక తృప్తి

23-12-2024 01:11:13 AM

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఆధ్యాత్మికత, భక్తి భావంతోనే మనకు మానసిక తృప్తి లభిస్తుందని ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపెల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ఆదివారం జరిగిన మల్లన్నస్వామి జాతర సందర్భంగా స్వామి వారిని  అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్’రెడ్డిలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం తులా భారంలో పాల్గొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించి, ప్రసాదా న్ని భక్తులకు పంపిణీ చేశారు.