25-03-2025 12:23:16 AM
పద్మశాలి కాలనీలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మార్చి 24: (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకున్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్‌పూర్‌లోని పద్మశాలి కాలనీలో సంజీవ హనుమాన్ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి రెండవ వార్షికోత్సవ మహోత్స వాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదా య పద్ధతిలో పట్టు వస్త్రాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి సమర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ హనుమాన్ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహో త్సవాలు, ఉగాది పురస్కారాలు, శ్రీరామనవమి వేడుకలు ప్రతి యేటా వైభవంగా నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మికత భావాలను పెంపొందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, ఆలయ బీ ఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బింగి నవీన్ కుమార్ ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సీతా మార్కండేయ, పుండరీకం, కోశాధికారి గడ్డం నవీన్ కుమార్, కార్యనిర్వహక కార్యదర్శి ఎ. వెంకటేష్ నాయకులు ముచ్చక్కుర్తి ప్రభాకర్, ఆర్. ఆంజనేయులు వినోద్ కుమార్, ఎం. కృష్ణమూర్తి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయి
పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. ఈ మేరకు సోమవారం భోళాపూర్ డివిజన్ లోని గుల్షన్ నగర్‌లో అంజుమన్ హాల్లో స్థానికులు షఫీ ఉద్దిన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ సందర్భంగా ము ఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో ఉంటూ ఐదు సార్లు ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారన్నారు. ముషీరాబాద్‌లో వర్గాల ప్రజలు ఐక్యంగా పండుగలను జరుపుకుంటూ మతసామరస్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. ఈ కార్యక్ర మంలో ముషీరాబాద్ సిఐ రాంబాబు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, పార్టీ సీనియర్ నాయకుడు అక్లక్ హుస్సేన్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చాంద్, కాంగ్రెస్ నాయకుడు మసూద్, తదితరులు పాల్గొన్నారు.