జగిత్యాల, డిసెంబరు 29 (విజయక్రాంతి): సాంకేతికత పెరిగిన ప్రస్తుత యాంత్రిక జీవనంలో మనకు ఆధ్యాత్మికత తోనే మానసిక సంతృప్తి లభి స్తుందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యా ల జిల్లా కేంద్రంలో నవదుర్గా క్షేత్రంలో ఆదివారం అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండువగా నిర్వహించారు.
వేద బ్రాహ్మణులు తిగుళ్ళ విష్ణుశర్మ ఆధ్వర్యంలో ఈ మహా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపారు. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ఇతర ప్రముఖులు పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రత్యేక వేదికపై అయ్యప్ప, గణపతి, సుబ్రమణ్య స్వాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి 18మెట్లను పూలమాలలతో అలంకరించి గణపతి, కుమార స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయ్యప్ప భజనలతో, నామస్మరణంతో ఈ ప్రాంతమంతా మారుమోగింది. నవ దుర్గా సేవా సమితి ట్రస్ట్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజయ్యారు.