calender_icon.png 7 March, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో ప్రశాంతత

07-03-2025 01:42:19 AM

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్, మార్చ్ 6 (విజయ క్రాంతి) : ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా గురువారం శబరి మాత, శివాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్టాపనకు తనవంతుగా రూ. 40 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. 

అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి మార్గంలో నడవాలని గిర్నూర్ గ్రామంలో అమ్మ వారి భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారని ఎంత భక్తి ఉంటే మూడు రోజుల నుంచి గ్రామమంత ఒకేచోట చేరి పూజలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.  మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.