calender_icon.png 6 February, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మృతి

06-02-2025 01:28:43 AM

* పోర్చుగల్‌లో తుదిశ్వాస విడిచిన ఆధ్యాత్మిక నేత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖా న్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ తన వెబ్‌సైట్ ద్వా రా ప్రకటించింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో మంగళవారం ఆయన తుదిశ్వాస విడి చి నట్టు ప్రకటనలో పేర్కొంది. ‘అగాఖాన్ కుటు ంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయి లీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేస్తున్నా ం. ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమై న బేధాలు లేకుండా ఆయన కోరుకున్నట్టు గా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం’ అని ప్రకటించింది. 

ప్రధాని మోదీ సంతాపం

ఆగాఖాన్ మృతిపై ప్రధాని ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. ఆగాఖాన్ మృతి తనను బాధించిందన్న ప్రధాని.. ఆరో గ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి చాలా మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రపంచ వ్యాప్త ంగా ఉన్న లక్షలాది మంది అనుచరులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌తో అనుబంధం

ఆధ్యాత్మిక నాయకుడు ఆగాఖాన్ హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోని కులీ కుతుబ్ షా సమాధుల సముదాయాన్ని పునరుద్దరించడంలో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్(ఏకేడీఎన్) కీలక పాత్ర పోషించింది. అలాగే నగరంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏకేడీఎన్ అనేక పాఠశాలలు, వృత్తిశిక్షణా కేంద్రాలతో సహా అనేక విద్యాసంస్థలను స్థాపించింది. 

తీరని లోటు : సీఎం రేవంత్‌రెడ్డి 

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల అధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఇస్తాయిలీ ముస్లింల వారసుడిగా, ఆద్మాత్మిక గురువుగా నియమితులైన ఆగాఖాన్ మరణం మానవాళికి తీరనిలోటన్నారు. 

20ఏళ్ల వయసులోనే ఇమామ్‌గా..

దివంగత సర్ సుల్తాన్ మ హ్మద్ షా ఆగాఖాన్ మనవ డే ఆగాఖాన్  ప్రిన్స్ అలీఖాన్ దంపతులకు  1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్‌లోని క్రెక్స్ లో ఆగాఖాన్ జన్మించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రా డ్యూయేట్ చదవిన ఆయన.. 1957లో తన 20వ ఏట ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇ మామ్‌గా నియమితులయ్యారు.

19 67లో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. ఇది 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహనిర్మా ణం, గ్రామీణాభివృద్ధిలో విస్తరిం చిం ది. బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్ వంటి దేశాల్లో అనేక ఆసుపత్రు లు, పాఠశాలలను నిర్మించింది. ఆగాఖాన్ సేవలను గుర్తించిన భారత ప్రభు త్వం ఆయనను 2015లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.