calender_icon.png 11 March, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్మాత్మిక భక్తి భావనలు పెంపొందాలి

11-03-2025 12:18:51 AM

సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు చల్లా వంశీచంద్ రెడ్డి

కడ్తాల్, మార్చి 10 (విజయక్రాంతి) :  సమాజంలో ఆధ్యాత్మీక భక్తి భావం మరింత పెంపొందాలని, భక్తి భావనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి  అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని ఆన్మాస్పల్లి గ్రామ సమీపంలోని శ్రీరామ వీరాంజనేయ క్షేత్రంలో ఆలయ నిర్వాహకులు కోర్పోలు లీలా లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో, శ్రీ సీతారామ, శ్రీ పరమేశ్వర, శ్రీచక్ర సహిత జ్ఞాన సరస్వతి దేవీల ప్రథమ వార్షిక ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

ఉత్సవాలలో భాగంగా సోమవారం వేద పండితులు వెంకటేశ్వర శర్మ పండిత బృదం ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉపనిషత్తు పారాయణం, తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలకు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డితో పాటు, పలువురు నాయకులు హజరై, పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి భజనలు, గీతాలాపనలతో పూజలు చేపట్టారు.

భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుని పూజలు జరిపారు.ఆదే విధంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి,  పారిశ్రామికావేత్త, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, విఠలయ్యగౌడ్, నాయకులు బీక్యానాయక్, కేశవులు, పర్వతాలు, యాదయ్య, రామకృష్ణ, నత్యం, రాజుగౌడ్, జగన్ గౌడ్  శ్రీరాములు, వెంకట్ రెడ్డి ఆలయ నిర్వాహకులు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు.