మాణిక్యగిరి పుణ్యక్షేత్ర స్వామీజీ శివానంద
నారాయణపేట, జనవరి 26 (విజయ క్రాంతి): అహింసా మార్గంలోనే ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని యానగుంది మాణిక్య గిరి పుణ్య క్షేత్ర స్వామి శ్రీ శివానంద తెలిపారు. హిందూ ఐక్య వేదిక నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ - బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నారాయణపేట జిల్లా కేంద్రంలోని గొడుగుగేరి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి శివా నంద స్వామీజీ ముఖ్య వక్తగా హాజరై భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత మన అందరిపై ఉందని అన్నారు. నారాయణ పేట ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతుందని, రామ రాజ్యం రాబోతుందని మానికేశ్వరి మాత ప్రబోధించినట్లు స్వామీజీ తెలిపారు. నామాలు వేరైనా దేవుడు ఒక్కరే అన్నారాయన.
నాడు ఆంజనేయుడు శ్రీ రాముని పూజించి భక్తిని చాటుకున్నారని, అలాగే ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ స్మరణతో భక్త ప్రహ్లాదుడు అయ్యాడని గుర్తు చేశారు. దైవ చింతనే ముక్తికి మార్గం అన్నారు.హనుమాన్ చాలీసా ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలోనే నడచి హిందుత్వాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడాలని సూచించారు.
అనంతరం పెద్దసంఖ్యలో పిల్లలు, పెద్దలు, మహి ళలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని ముక్త కంఠంతో పటించా రు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్. రాంబాబు, ఆర్.ఎస్.ఎస్. నగర సంఘ చాలక్ డాక్టర్. మదన్ మోహన్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షులు కన్న శివకుమార్, బజరంగ్దళ్ కార్యదర్శి శ్రవణ్, గొడుగు గేరి అభయాంజనేయఅభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.