10-03-2025 01:09:35 AM
నల్లగొండ, మార్చి 9 (విజయక్రాంతి) : ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులున్నారు.