calender_icon.png 24 February, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాలతో ఆధ్యాత్మిక శోభ

22-02-2025 12:43:14 AM

నీలం మధు ముదిరాజ్

ఇస్నాపూర్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ

పాల్గొన్న మాధవానంద సరస్వతి

పటాన్ చెరు, ఫిబ్రవరి 21 : దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో  ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన  శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాధవానంద సరస్వతి హాజరై భక్తులకు ఆశీర్వాదం అందజేసి ప్రవచనాలు వినిపించారు.  అనంతరం నీలం మధు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి బయట పడటానికి ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలన్నారు.

దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆలయాల నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం,  మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు మన్నె రాఘవేందర్, ఊళ్ళ శంకర్, పెంటయ్య, యాదగిరి, రవి, రాజు, మణికంఠ, పాండు, వి నారాయణరెడ్డి, అశోక్, పాండు, సుధాకర్, ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.