26-02-2025 10:09:47 PM
శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించేందుకు పోటీ పడుతున్న భక్తులు...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఆలయాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక శోభ చేకూరింది. బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో గ్రామస్తులకు ఆరాధ్య దైవమైన శ్రీ సోమేశ్వర దేవాలయం విద్యుత్ కాంతుల్లో భక్తులను కట్టిపడేస్తుంది. మరోవైపు ఆకెనపల్లి శివారులోని లింగాపురం గ్రామంలో గల మహిమాన్విత శివాలయంగా పేరొందిన త్రిలింగేశ్వర ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రెండు దేవాలయాల్లో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కన్నుల పండుగగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. త్రిలింగేశ్వర ఆలయంలో భక్తులను కట్టిపడేసేలా ఏర్పాటుచేసిన భారీ వివాహ వేడుక సెట్టింగ్ నియోజకవర్గంలో హైలెట్ గా నిలిచింది. ఈ రెండు ప్రధాన దేవాలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కన్నుల పండుగ వీక్షించేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.