యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో సోమవారం 1999 - 2000 సంవత్సరం చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారందరు గత స్ముతులను జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే వారికి చదువు చెప్పిన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అశ్విని, ఏ వరలక్ష్మి, సంద్య, రేవతి, అనిత, రాజా రెడ్డి, కవిత, అర్చన, కవిత, సంద్య, స్నేహ తదితరులు పాల్గొన్నారు.