31-03-2025 12:11:23 AM
ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ చిత్రంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల కోసం ఆయన పనిచేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివరలో ‘స్పిరిట్’ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమాను టీ సిరీస్ నిర్మిస్తోంది.
సందీప్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇటీవల సందీప్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఉగాది సందర్భంగా సందీప్‌రెడ్డి వంగా అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్లో స్పిరిట్ గురించి అడగ్గా.. “నేను లొకేషన్స్ చూసేందుకు మెక్సికోకు వచ్చాను. ‘స్పిరిట్’ సినిమా మెక్సికోలో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి స్పిరిట్ అప్డేట్ ఇదే” అని తెలిపారు.