ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’తో పాటు ‘ఫౌజి’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి పూర్తుతై వెంటనే నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. అయితే షూటింగ్స్ నుంచి ప్రభాస్ లాంగ్ బ్రేక్ తీసుకున్నాడంటూ వార్తలు వినవస్తున్నాయి.
ఇదే జరిగితే ‘రాజా సాబ్’ విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది. అ లాగే ఈ సంక్రాంతి తర్వా త ప్రారంభించాల్సిన ‘స్పిరిట్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ సైతం వాయిదా పడిందని తెలుస్తోంది. ఎందుకోగానీ ఈ చిత్రం అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం ‘స్పిరిట్’ మే నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా కథాంశంతో స్పిరి ట్ రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు.
ఇమాన్వికి ప్రభాస్ ఆతిథ్యం
ఇదిలా ఉండగా ‘ఫౌజీ’ బ్యూటీ ఇమాన్వీకి ప్రభాస్ ఆతిథ్యం ఇచ్చాడు. ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ తన ఇంటి నుంచి రకరకాల ఫుడ్స్‌తో కూడిన క్యారియర్‌ను ఇమాన్వికి పంపాడు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇమాన్వి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.