25-02-2025 12:00:00 AM
అను ప్రొడక్షన్స్‌లో విరాజ్‌రెడ్డి చీలం హీరో గా రూపొందుతున్న చిత్రం ‘గార్డ్’. రివెం జ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ థ్రిల్లిం గ్ హారర్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. తాజాగా 12 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు శ్రీకాంత్, సుధీర్‌బాబు, నిఖిల్ సిద్ధార్థ్, థమన్, ఓంకార్, తరుణ్, సుశాంత్, ఆది, అశ్విన్ బాబు, సన్నీ వీజే, సామ్రాట్, ప్రిన్స్ సోషల్ మీడియా ఖాతాలా ద్వారా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
మిస్టీరియస్ యాక్షన్‌తో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ మూమెంట్స్‌తో ఓ అద్భుతమైన హారర్ ఎంటర్‌టైనర్‌గా గార్డ్ రాబోతోంది. మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ గ్లామర్ పార్ట్, ఫ్రెండ్ క్యారెక్టర్‌తో చేయించిన కామెడీ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి. జగ పెద్ది దర్శకతంలో అనసూయరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం 28న విడుదల కానుంది.