17-04-2025 12:41:09 AM
- రూ. 5వేలు పైన్ వేసిన మున్సిపల్ అధికారులు
చేవెళ్ల ,ఏప్రిల్ 16: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎం.జి ఫుడ్ కోర్ట్ లో కుళ్లిన గుడ్లు, పాచిపోయిన చికెన్ వాడడం వెలుగులోకి వచ్చింది. బుధవారం మున్సిపల్ అధికారులు తనిఖీ చేయగా ఫ్రీజ్ లో నిలువ చేసిన పాచిపోయిన చికెన్, కుళ్లిన గుడ్లు బయపడ్డాయి. దీంతో నిర్వాహకులకు రూ.5 వేలు జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడుతున్న ఈ పుడ్ కోర్టు ను సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు.