న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సెక్యూరిటీల జారీద్వారా రూ. 3,000 కోట్ల నిధుల్ని సమీకరించాలన్న ప్రతిపాదనకు స్పైస్‌జెట్ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. పలు న్యాయపోరాటాలు, ఆర్థిక సవాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ విమానయాన సంస్థ వివిధ అవసరాల్ని తీర్చేందుకు నిధులు సమీకరించాలని ప్రతిపాదించింది.
ఇందుకోసం రూ. 3,000 కోట్ల సేకరణకు ప్రతిపాదించిన ప్రత్యేక తీర్మానాన్ని తమ షేర్‌హోల్డర్లు ఆమోదించారని స్పైస్ జెట్ తెలిపింది. క్విప్ ఇష్యూ జారీ, ఇతర మార్గాల ద్వారా నిధుల్ని సమీకరిస్తుంది. 2019లో 74 విమానాలు కలిగిన స్పైస్ జెట్ ప్రస్తుతం 20 ఎయిర్‌క్రాఫ్ట్‌లను మాత్రమే నడుపుతున్నది. నిధు ల సమీకరణ వార్త నేపథ్యంలో శుక్రవారం స్పైస్‌జెట్ షేరు 8 శాతం పెరిగి రూ. 71.55 వద్ద ముగిసింది.