పిల్లలు కనాలన్న వారి కల.. కలగానే మిగిలిపోతోంది. ఒకప్పుడు ఈ సమస్య మహిళల్లో ఉండేది. అయితే మారుతున్న కాలంలో పురుషుల్లోనూ ఈ సమస్య ఎక్కువైంది. ప్రపంచవ్యాప్తంగా మగ వంధ్యత్వ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ఈ సమస్య చాలామంది దంపతుల కలల్ని విచ్ఛిన్నం చేస్తుంది. అయితే వంధ్యత్వం ఎందుకు పెరుగుతోంది. దీనికి పరిష్కారమార్గాలు ఏమిటో చూద్దాం..
మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సంతానోత్పత్తి రేటులో నేటికీ వెనుకపడే ఉంది. తాజా లెక్కల ప్రకారం 2023లో సంతానోత్పత్తి రేటు 2 కి పడిపోయింది. ఇది అవసరమైన భర్తీ స్థాయి కంటే కేవలం 0.1 పాయింట్ తక్కువ.
ఈ చిన్న వ్యత్యాసం కూడా చివరికి జనాభా క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే యువ జంటలలో 40-- శాతం వంధ్యత్వ కేసులుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
జీవనశైలినే కారణం
సాధారణంగా చాలామంది మగవాళ్లు తమ జీవనశైలిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం లేదు. మంచిది కాదని తెలిసినా కొన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టడం లేదు. 25 ఏళ్ల వయస్సులోనే నిర్లక్ష్య జీవనశైలిని కొనసాగిస్తుండటంతో 30 ఏళ్ల వయస్సుకు చేరుకున్న తర్వాత వారిలో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది.
తద్వారా ఒక బిడ్డకు జన్మను ప్రసాదించే అవకాశాన్ని కోల్పోతారని డాక్టర్లు అంటున్నారు. ఒక జంట గర్భం దాల్చాలంటే ఆడ, మగ ఇద్దరూ కీలకపాత్ర పోషిస్తారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి వద్ద లోపం ఉన్నా, ఆ సమస్యను ఇద్దరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే మగవారి పునరుత్పత్తిలో లోపం ఉన్నా బిడ్డను కనని పరిస్థితుల్లో ఆడవారే ఎక్కువగా నిందలు, అవమానాలు భరిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల కాలంలో జంటల్లో సంతానలేమికి కారణం 50 శాతం పురుషుల నిర్లక్ష్యపు జీవనశైలే కారణం అని పరిశోధనల్లో వెల్లడైంది.
స్పెర్మ్ ఫ్రీజింగ్‌తో..
ప్రస్తుతం పురుషుల సంతానోత్పత్తిని కాపాడటానికి స్పెర్మ్ ఫ్రీజింగ్ బెస్ట్ ఆప్షన్‌గా మారింది. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి భవిష్యత్తులో వంధ్యత్వాన్ని ఎదు ర్కొనే అవకాశం ఉన్న సందర్భాల్లో ఇది బా గా పనిచేస్తుంది. వీర్య కణాలను క్రయోప్రొటెక్టెంట్ ద్రావణంతో చికిత్స చేస్తారు. ఇది ఘనీభవన ప్రక్రియలో నష్టం నుండి కాపాడుతుంది.
ఆ తరువాత వీర్యకణాలను ద్రవ నత్రజనిలో అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తారు. దాంతో 20 సంవత్సరాలపా టు జీవించి ఉంటుంది. అయితే మనదే శం లో స్పెర్మ్ ఫ్రీజింగ్ అనేది అందుబాటు లో ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ కొనసాగుతోంది. రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు స్పెర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు.