calender_icon.png 3 April, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి

01-04-2025 12:00:00 AM

పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను 

ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ 

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 31 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ సోమవారం పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులను  ఎస్పీ రోహిత్ రాజు  ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.ముందుగా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎస్త్స్ర పనిచేస్తూ ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన సూరిశెట్టి శ్రీనివాసరావుని ఎస్పీ  ఘనంగా సత్కరించారు.పోలీస్ శాఖలో నిత్యం విధుల నిర్వహణలో ఉండే అధికారులు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా వాటిని పరిష్కరించే విధంగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన శ్రీనివాసరావు సేవలు మరువలేనివన్నారు. 

అశ్వరావుపేటలో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన రెహమాన్ అనారోగ్య సమస్యలతో వాలంటరీ రిటైర్మెంట్ పొందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వజ్జ రామయ్య లను పూలమాలలు,శాలువాలతో  సత్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన అధికారులు  సిబ్బంది తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలన్నారు. గత 40 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ తాము సాధించిన అనుభవాన్ని  పదవీ విరమణ పొందిన అధికారులు ఎస్పీ  వివరించారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, వెల్ఫేర్ ఆర్‌ఐ కృష్ణారావు,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.