calender_icon.png 28 December, 2024 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్చు లేకుండా సత్వర న్యాయం

12-09-2024 12:25:00 AM

లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): లోక్ అదాలత్‌లో ఖర్చులు లేకుండా సత్వరమే కక్షిదారులకు న్యాయం అందుతుందని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పా ల్ తెలిపారు. ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా అథారిటీ జిల్లా చైర్‌పర్సన్లు, కార్యదర్శులతో బుధవారం ఆయన వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. డీజీపీ, ఎస్పీలు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మొదలైన వారిని కలవాలని సూచించారు. టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, పరిపాల నాధికారి జీ కలార్చన పాల్గొన్నారు.