హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే
నల్లగొండ, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): సాంకేతికత, డిజిటలైజేషన్‌తో పిటిషనర్లకు సత్వర న్యాయం అందించేందుకు వెసులుబాటు కలుగుతుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. నల్లగొండలో శనివారం ఆయన కోర్టు భవనాలను ప్రారంభిం చి మాట్లాడారు. కోర్టులన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. సాంకేతికత, డిజిటలైజేషన్ ద్వారా న్యాయవ్యవస్థ సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఇకపై నల్లగొండ కోర్టు లో కేసులన్నీ డిజిటలైజ్ అవుతాయన్నారు. కోర్టులో లైబ్రరీ, రిక్రియేషన్ వంటి సౌకర్యా లు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్ని కోర్టుల్లోనూ ఈ సాంతికేతికతను తీసుకొస్తామన్నారు. నల్లగొండ బార్ అసోసియేషన్, బెంచ్ సమన్వయంతో పనిచేసి కేసులను సత్వరం పరిష్కరించాల న్నారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జీ వినోద్‌కుమార్ లక్ష్మణ్, విజయ్‌సేన్‌రెడ్డి, కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నాగరాజు, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.