హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద సూచన
జనగామ, ఆగస్టు 31(విజయక్రాంతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా న్యాయవాదులు పనిచేయాలని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద సూచించారు. శనివారం ఆమె జనగామ జిల్లా కోర్టును సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం లో నందకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్వా గతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుం చి జిల్లా కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆవరణలో జిల్లా న్యాయాధికారి రవీంద్రశర్మతో కలిసి మొక్కను నాటారు. అనంతరం మహిళా బార్ అసోసియేషన్, రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు, బ్యాడ్మెంటన్ కోర్టు, మహిళల రెస్ట్ రూం, ఈ ప్రారంభించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రరుషి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయవాదులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు మధ్య సత్సంబంధాలు కొనసాగినప్పుడు కేసులు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయాధికారి విక్రమ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి సుచరిత, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి సందీప పాల్గొన్నారు.