calender_icon.png 19 November, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్వర న్యాయమే భరోసా

01-09-2024 01:04:42 AM

  1. మహిళలపై నేరాల్లో వేగవంతమైన విచారణ అవసరం 
  2. జిల్లా న్యాయవ్యవస్థల ప్రత్యేక సదస్సులో ప్రధాని మోదీ 
  3. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా స్మారకం, నాణెం విడుదల 

న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత్‌లో మహిళలపై జరుగుతోన్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మహిళలపై నేరాలకు సత్వరమే తీర్పులు రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇలాంటి నేరాల్లో వేగంగా విచారణ పూర్తి కావాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచి ంచారు. మహిళలు, చిన్నారుల భద్రత సమాజానికి ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రి ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టును నెలకొల్పి 75 సంవత్సరాలు పూర్తయిన నేప థ్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన జిల్లా న్యాయవ్యవస్థలపై జరిగిన ప్రత్యేక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను సుప్రీంకోర్టు బలోపేతం చేసిందని మోదీ ప్రశంసించారు. వ్యవస్థల పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పడంతో కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు

సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్మారక చిహ్నం, రూ.75 నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీం న్యాయమూర్తులు పాల్గొన్నా రు. సుప్రీంకోర్టు భారత ప్రజాస్వామిక వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు.  అత్యవసర పరిస్థితిలోనూ ప్రాథమిక హక్కులకు సుప్రీంకోర్టు హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.