calender_icon.png 2 November, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహహింస బాధితులకు సత్వర న్యాయం

31-07-2024 12:28:31 AM

సైబరాబాద్ చిల్డ్రన్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): గృహహింస బాధితులకు సత్వర న్యాయం అందించడమే ప్రథమ కర్తవ్యమని సైబరా బాద్ కమిషనరేట్ చిల్డ్రన్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కే సృజన అన్నారు. ఆమె అధ్యక్షతన మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గృహహింసపై వివిధ జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహహింసను నియంత్రించ డానికి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులను ఆదుకోవడానికి పోలీసు అధికా రులు  కృషి చేయాలన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలకు చెందిన షీ టీమ్స్, యాంటీ ట్రాఫికింగ్ యూనిట్, సఖి సెంటర్, భరోసా సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.