భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి సమీపిస్తున్నందున తప్పనిసరిగా ట్రైబల్ మ్యూజియంనకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి మ్యూజియంను విద్యుత్ కాంతులతో విరాజిల్లేలా సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోని మ్యూజియమును పర్యాటకులు ఆకర్షించేలా ముస్తాబు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం నాడు ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను సందర్శించి జరుగుతున్న పనులను సంబంధిత ట్రైబల్ మ్యూజియం కమిటీ సభ్యులతో చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 9, 10 తేదీలలో సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం జరుగుతున్నందున భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున వారు తప్పనిసరిగా ట్రైబల్ మ్యూజియంను సందర్శించేలా భద్రాచలం పట్టణంలోని ముఖ్య కూడళ్ళలో, మ్యూజియం ఎదురుగా మ్యూజియం సంబంధించిన స్వాగత బోర్డులు ఏర్పాట్లు చేయాలని, పర్యాటకులు మ్యూజియం సందర్శించడానికి వచ్చినప్పుడు సాంప్రదాయకమైన దుస్తులు ధరించిన స్త్రీలు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
మ్యూజియంలో ట్రైబల్ కు సంబంధించిన పాతకాలపు వస్తువులు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వెంటనే చేపట్టాలని, పాతకాలపు ఇండ్లనిర్మాణంలో కొండరెడ్ల కుటుంబాలకు సంబంధించిన గృహోపకరణాలు(సామానులు) అమర్చాలని, పర్యాటకులు సెల్ఫీ దిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పర్యాటకులు మ్యూజియమును సందర్శించి తన్మత్వయం చెందేలా పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలతో అలంకరించాలని, బోటింగ్ షికారు, ట్రైబల్ కల్చర్, క్రీడా స్థలాలలో ఏమైనా మైనార్టీ పేర్లు ఉంటే వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎఫ్ డి సి ఉదయ్ కుమార్, ఐటీసీ జిఎం చంగల్ రావు, ఏపీవో పవర్ ఏఈ మునీర్ పాషా, డిఇ హరీష్, మలేరియా అధికారిని స్పందన, జేడీఎం హరికృష్ణ, ఈవో జిపి శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.