calender_icon.png 14 December, 2024 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైబల్ మ్యూజియం పనులు వేగవంతం చేయండి

13-12-2024 07:45:39 PM

అధికారం ఆదేశించిన పి ఓ రాహుల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి దగ్గర పడుతున్నందున ఆదివాసి గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంను పర్యాటకులు ఆకర్షించే విధంగా అన్ని హంగులతో సిద్ధం చేయడానికి జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రస్తుతం మ్యూజియంలో ఉన్న సాంప్రదాయకమైన కల్చర్ కు సంబంధించిన సామానులు తెగల వారిగా సర్దుబాటు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు ట్రైబల్ మ్యూజియంలకు డిజైనింగ్ చేసిన ట్రైబల్ మ్యూజియం డైరెక్టర్ తో సందర్శించి మ్యూజియంలో వివిధ ఆదివాసి తెగల కల్చర్ కు సంబంధించిన సామానుల గురించి పూర్తిస్థాయిలో వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలలోని పాత తరం గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయం బద్దమైన వస్తువులు సేకరించి ఈ మ్యూజియమును అభివృద్ధి పరచడానికి పర్యాటక శాఖ అనుమతి ఇచ్చినందున ఈ మ్యూజియంను పాతతరం ఇండ్ల నిర్మాణం, గుడిసెలు, వారి యొక్క కల్చర్, ఆదివాసి వంటకాలు టూరిస్టులకు కనువిందు కలిగేలా తయారు చేస్తున్నామని, అందుకు ఈ మ్యూజియంను చూపరులకు ఆకర్షించే విధంగా డిజైనింగ్ రూపొందించాలని ఆయన అన్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా నేటితరం గిరిజన యువతరానికి తెలియజేయడం కోసం, ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఖండాంతరాలకు వ్యాపించడానికి ఈ మ్యూజియం నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ మ్యూజియం డైరెక్టర్ సత్యనారాయణ, డి ఈ హరీష్, జేడీఎం హరికృష్ణ, ట్రైబల్ మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.