పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని స్పిన్నింగ్ మిల్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధిత అధికారులు, గుత్తిదారుకు సూచించారు. ఆదిలాబాద్ లో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. సంబంధిత గుత్తిదారుతో మాట్లాడుతూ.. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ కూడా పూర్తి చేసి గడువులోగా పనులు కంప్లీట్ చేయాలని అన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు జోగు రవి, అశోక్ రెడ్డి, తదతరులు ఉన్నారు.