calender_icon.png 5 April, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి

05-04-2025 02:32:21 AM

సబ్ కలెక్టర్ వికాస్ వికాస్

బోధన్,ఏప్రిల్04:(విజయ క్రాంతి) : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో స్థానిక అధికారులకు సూచించారు. బోధన్ మండలంలోని పంటఖుర్ధు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ పరిశీలించారు.

ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ సమయం ఉండకుండా, ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సూచించారు.