calender_icon.png 29 December, 2024 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు

28-12-2024 07:43:32 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): శని త్రయోదశినీ పురస్కరించుకొని శనివారం రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ దేవి స్వయంభు మహంకాళి దేవస్థానం వద్ద శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శని దేవుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి నైవేద్యాలను భక్తులు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకుడు దేవర వినోద్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.