calender_icon.png 16 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

16-11-2024 01:50:32 AM

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): శబరిమల భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ నెల 21, 28 తేదీల్లో 07133 నంబర్ రైలు కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 07134 నంబర్ రైలు ఈనెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11:40 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. హైదరాబాద్‌లో ఈ నెలలో 19, 26వ తేదీల్లో 07135 నంబర్ రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 07136 నంబర్ రైలు ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి తర్వాత రోజు రాత్రి 11.45  గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. నాందేడ్ నుంచి 07139 నంబర్ రైలు ఈ నెల 16న ఉదయం 8.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న మరో రైలు (07140) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మౌలాలీలో ఈ నెల 23, 30న 07141 నంబర్ రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాత రోజు రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2వ తేదీల్లో 07142 నంబర్ గల రైలు కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి తర్వాతరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మౌలాలీకి చేరుకుంటుంది.