హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): దీపావళి, ఛత్ పండగల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. రద్దీకి అనుగుణంగా 850 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. వీటితో పాటు వెయిట్ లిస్టులో ఉన్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైళ్లకు అదనపు కోచ్‌లు జోడించినట్లు పేర్కొంది.
ప్రయాణీకులు సాఫీగా టికెట్లు తీసుకోవడానికి ప్రధానస్టేషన్లలో 14 అదనపు కౌంటర్లతో పాటు సాధారణ టికెటింగ్ కార్యకలపాలు బలోపేతం చేసినట్లు వివరించింది. రద్దీ పర్యవేక్షణకు ప్రధాన స్టేషన్లలో అధికారులను నియమించింది.